ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ టాక్స్ ఇనెస్పెక్టర్

 

హైదరాబాద్ జనవరి 09 (globelmedianews.com)
గ్రేటర్ హైదరాబాద్ శేరిలింగంపల్లి జీహెచ్ ఎంసీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి.  పదిహేను వేల రూపాయలు లంచం తీసుకుంటూ టాక్స్ ఇనెస్పెక్టర్ యాదయ్య, అతని వ్యక్తిగత సహాయకుడు సాయిలు అధికారులకు రెడ్ హ్యండెడ్ గా పట్టుబట్టారు.  ఏసీబీ అధికారులు తెలిపిన మేరకు బాధితుడు కట్టుకుంటున్న భవంతి అనుమతి కోసం యాదయ్యను సంప్రదించాడు. 
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ టాక్స్ ఇనెస్పెక్టర్

దాంతో అయన వ్యక్తిగత సహాయకుడు సాయి రంగంలోకి వచ్చాడు. భవంతి కొలతలు తీసుకుని దాదాపు రూ 30 వేలు అవుతాయని భయపెట్టాడు. పన్ను తగ్గించడానికి పదిహేను వేలు లంచం డిమాండ్ చేసారు. దాంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేసాడు.  వాళ్లు చెప్పినట్లు బాధితుడు గురువారం ఉదయం యాదయ్య సమక్షంలో సాయి పదిహేను వేల రూపాయల లంచం ఇచ్చాడు.  అక్కడే వున్న ఏసీబీ బృందం యాదయ్య, సాయిలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు తరువాత ఇద్దరిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని అన్నారు.

No comments:
Write comments