కుష్టు వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ

 

జాయింట్ కలెక్టర్ 2 సయ్యద్ ఖజా మొహిద్దిన్
కర్నూలు, జనవరి ౩౦ (globelmedianews.com)
కుష్టు వ్యాధి గ్రస్తుల పట్ల వివక్షత చూపకుండా వ్యాధిగ్రస్తులను కుటుంబంలోనూ  అలాగే సమాజం లోను చోటు కల్పించి సాధారణ జీవితం గడుపుటకు సహకరించాలని జాయింట్ కలెక్టర్  2 సయ్యద్ ఖాజా మొహిదీన్ తెలియజేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ గాంధీ విగ్రహం నుంచి జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ 2 జెండా ఊపి ప్రారంభించారు. 
కుష్టు వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ

ర్యాలీ గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమై రాజ్ విహార్ సర్కిల్ మీదుగా జిల్లా పరిషత్ కార్యాలయం సమీపంలో దగ్గరున్న గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ 2 మాట్లాడుతూ జనవరి 30 నుండి ఫిబ్రవరి 13వ తేదీ కుష్టు వ్యాధి నివారణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం కుష్టు  వ్యాధి అవగాహన కార్యక్రమం లో భాగంగా జిల్లా కలెక్టర్ గారి సందేశం జాయింట్ కలెక్టర్   చదివి వినిపించారు. ర్యాలీలో డిఎంహెచ్ఓ వెంకటరమణ, అడిషనల్ డిఎంహెచ్ఓ నివారణ అధికారి చంద్రరావ్, డాక్టర్లు, ఆశ, అంగన్వాడి, నర్సింగ్ కళాశాల, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments